Mon Dec 23 2024 16:13:25 GMT+0000 (Coordinated Universal Time)
ముగిసిన జగన్ రెండు రోజుల పర్యటన
కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన ముగిసింది
కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రెండో రోజు పర్యటన ముగిసింది. ఆయన మరికొద్దిసేపట్లో విజయవాడ బయలుదేరి రానున్నారు. నిన్న కడప జిల్లాకు వచ్చిన జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టూరిజం ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. చిత్రావతి నదిలో బోటింగ్ చేశారు. లింగాల మండల పార్టీ నాయకులతో సమావేశమైన జగన్ తనకు, తన కుటుంబానికి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వివాహ వేడుకలో...
తాను కడప జిల్లా అభివృద్ధికి పాటు పడతానని వారికి హామీ ఇచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి ఇడుపులపాయలో జగన్ బస చేశారు. ఈరోజు ఉదయం పులివెందులలో జరిగిన జగన్ పీఏ రవి కుమార్తె వివాహ వేడుకల్లో జగన్ దంపతులు పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన కడప నుంచి బయలుదేరి తాడేపల్లికి రానున్నారు.
Next Story