Sun Dec 22 2024 08:30:28 GMT+0000 (Coordinated Universal Time)
Second Saturday Holiday రెండో శనివారం: అక్కడ పాఠశాలలు తెరవాలి.. ఇక్కడ హాలిడే!
రెండో శనివారం సాధారణంగా పాఠశాలలకు సెలవును
రెండో శనివారం సాధారణంగా పాఠశాలలకు సెలవును ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం సెలవులు లేవని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో రెండో శనివారం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు పని చేస్తాయని జిల్లా విద్యాశాఖాధికారిణి శైలజ తెలిపారు. వరదలు, భారీ వర్షాల కారణంగా జిల్లా యంత్రాంగం పాఠశాలలకు ఇంతకు ముందు సెలవులు ప్రకటించిందని, దీనిని పరిగణనలోకి తీసుకుని పాఠశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేశామని ఈరోజు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు పని చేయాల్సిందేనని తెలిపారు.
అయితే కడప జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలకు రెండవ శనివారం కారణంగా నేడు సెలవు ప్రకటించినట్లు డీఈఓ మర్రెడ్డి అనురాధ తెలిపారు. రెండవ శనివారం రోజున జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యనాలలోని అన్ని పాఠశాలలకు వర్కింగ్ డేగా పనిచేయాలని తొలుత ఆదేశించామన్నారు. కానీ ఈ విద్యా సంవత్సరం పాఠశాలల పనిదినాలు 220 రోజులు తక్కువ కాని కారణంగా రెండవ శనివారం 14వ తేదీ అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవును ప్రకటించినట్లు తెలిపారు.
Next Story