Mon Dec 23 2024 04:00:45 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రి ఎయిర్పోర్టులో బుల్లెట్లు కలకలం
రాజమండ్రి ఎయిర్ పోర్టులో భద్రత సిబ్బంది బుల్లెట్లను గుర్తించారు. ఒక ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు గుర్తించారు
రాజమండ్రి ఎయిర్ పోర్టులో భద్రత సిబ్బంది బుల్లెట్లను గుర్తించారు. ఒక ప్రయాణికుడి వద్ద ఈ బుల్లెట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ ప్రయాణికుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తారు. ఈ సందర్భంగా స్కానింగ్ లో ఆరు బుల్లెట్లు బయటపడటంతో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని...
బుల్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి కోసం తీసుకెళుతున్నారు? వీటికి లైసెన్స్ ఉందా? వంటి విషయాలపై ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని భద్రతా సిబ్బంది ఆరా తీస్తున్నారు. అయితే బుల్లెట్లు తనవేనని ప్రయాణికుడు భద్రతాసిబ్బందితో తెలిపినట్లు తెలిసింది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story