Mon Dec 23 2024 02:14:43 GMT+0000 (Coordinated Universal Time)
సత్యమే గెలిచింది.. చంద్రబాబు విడుదలపై జయప్రద
టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పై విడుదల కావడంపై సినీనటి జయప్రద స్పందించారు
చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా సినీనటి, మాజీ ఎంపీ జయప్రద కూడా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు రావడం సంతోషమని జయప్రద అన్నారు. ప్రజల ఆశీర్వదంతో చంద్రబాబుకు ఉపశమనం లభించిందని జయప్రద అభిప్రాయపడ్డారు.
కక్ష పూరిత...
కక్ష పూరిత రాజకీయాలతో చంద్రబాబును జైలుకు పంపారని జయప్రద అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు జయప్రద అన్నారు. ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా పరిచయం చేస్తున్నారన్న ఆమె ఇలాంటి పోకడలకు రాజకీయ నేతలకు స్వస్తి చెప్పాలని జయప్రద కోరారు.
Next Story