Mon Dec 23 2024 16:20:32 GMT+0000 (Coordinated Universal Time)
సీఐడీ పోలీసుల అదుపులో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు
సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. బంగారం అక్రమ రవాణాకు ప్రభుత్వంలోని పెద్దలతో ముడిపెట్టి వాట్సప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఆయన భార్యకు నోటీసులు ఇచ్చి తీసుకెళ్లామని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన అంకబాబును అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. 73 ఏళ్ల వయసులో ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు.
జర్నలిస్ట్ సంఘాలు...
మరోవైపు జర్నలిస్ట్ సంఘాలు కూడా అంకబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని సూచిస్తున్నాయి. అంకబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు గుంటూరు వెళ్లారు. కేసులు నమోదు చేసే సెక్షన్లు బట్టి పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ వస్తుందా? లేక కోర్టులో వస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. అంకబాబు కోసం న్యాయవాదులు కూడా గుంటూరు చేరుకున్నారు.
Next Story