Mon Dec 23 2024 09:33:21 GMT+0000 (Coordinated Universal Time)
క్లారిటీ ఇచ్చిన కన్నా
ఈ నెల 23వ తేదీన తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు
ఈ నెల 23వ తేదీన తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన తన రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే తాను పార్టీలో చేరుతున్నానని, తనతో పాటు తన అనుచరులు కూడా అదే రోజు పార్టీలో చేరతారని తెలిపారు. ఒక వర్గం మీడియా తనపై అసత్య ఆరోపణలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అరాచకపాలన మొదలు పెట్టారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
23న టీడీపీలో చేరుతున్నా...
అరాచకాలు చేస్తున్న వారిని వదిలిపెట్టి ప్రజా సమస్యలపై పోరాడే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. పోలీసులు ఒక వర్గం వారికి అండగా నిలుస్తుందని ఆయన ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న కన్నా లక్ష్మీనారాయణ ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. డీజీపీ తక్షణమే జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను పరిష్కరించాలని కోరారు.
Next Story