Sun Dec 22 2024 15:51:35 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్న కేసులో హైకోర్టు ఆదేశాలివే
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఎదురుదెబ్బ తగిలింది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి డైరీ పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయ్యన్న పాత్రుడి అరెస్ట్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలయింది. ఇందులో వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
రేపటికి వాయిదా...
ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు కేసు డైరీని పరిశీలించిన తర్వాతనే దీనిపై తమ నిర్ణయం చెబుతామని పేర్కొంది. రేపు ఉదయం 10.30 కల్లా కేసు డైరీని తమ ఎదుట ఉంచాలని సీఐడీ పోలీసులను హైకోర్టు ఆదేశించిది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారన్న కేసులో అయ్యన్నపాత్రుడు, అతని కుమారుడు రాజేష్ లను సీఐడీ పోలీసులు తెల్లవారు జామున అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story