Mon Dec 23 2024 02:22:27 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఫూల్స్ ను చేయడానికి ప్రయత్నిస్తున్నారు
జగన్ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు
జగన్ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. జగన్ విడుదల చేసిన మ్యానిఫేస్టోకు దశదిశలేదని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మ్యానిపెస్టోలో కొత్త హామీలు ఏమీలేవని అన్నారు. ఓటమికి చివరి మెట్టు ఈ మేనిపెస్టో అని అన్నారు. జగన్ విడుదల చేసిన మ్యానిఫేస్టో అస్పష్టంగా ఉందన్నారు. జగన్ నిన్న కనపరచిన హావభావాలను చూస్తే ఇన్నోసెంట్ గా కాకుండా ఇగ్నోరెంట్ గా మాట్లాడుతున్నారని పిస్తోందన్నారు. సొంత పార్టీ నేతలే మ్యానిఫేస్టోను వ్యతిరేకస్తున్నారన్నారు. వైసీపీ నేతలే ప్రజలను ఆకట్టుకునే మేనిపెస్టో ప్రకటిస్తారని ఆశించారన్నారు. కొత్త పధకాలు వుంటాయని ఆశించారని అన్నారు.
వ్యవసాయ రంగం గురించి...
జగన్ తన మ్యానిఫేస్టోలో వ్యవసాయ రంగం గురించి ప్రస్తావించలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పై నిర్లక్ష్యంగా వ్యవహారించినట్లు అనిపించిందని సి.రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. ప్రతీ సారీ మోసం చేసి గెలవలేరని, రెండవసారి కూడా అలాగే గెలవాలనుకుంటున్నారన్నారని, అది సాధ్యం కాదని సి.రామచంద్రయ్య అన్నారు. నిన్న మ్యానిఫేస్టో విడుదల సందర్భంగా నిజాలను చెప్పకుండా దాట వేస్తూ వచ్చారన్నారు. అయిదేళ్ళల్లో ఎందుకు జాబ్ కాలెండరు అమలు చెయ్యలేదని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితిని ప్రజలు నమ్మరన్న సీఆర్ అభివృద్ధి సంక్షేమం జిల్లాలోనే లేదు రాష్ట్రంలో ఏముంటుందన్నారు.
Next Story