Sun Dec 22 2024 21:47:13 GMT+0000 (Coordinated Universal Time)
ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల నరేంద్రకు ఈ మెయిల్ ద్వారా అధికారులు నోటీసులు పంపారు. సెక్షన్ 43 ప్రకారం ట్రస్ట్ స్వాధీనానికి అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.
ట్రస్ట్ స్వాధీనానికి....
దేవదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 43 కింద ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు గతంలోనూ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ధూళిపాళ్ల నరేంద్ర కోర్టును ఆశ్రయించారు. ట్రస్టు దేవాలయ చట్టం పరిధిలోకి రాదని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆసుపత్రి ద్వారా రైతు కుటుంబాలకు సేవ చేస్తుందని పేర్కొంది. అయితే తాజాగా కొద్ది సేపటి క్రితం అధికారులు నోటీసులు ఈమెయిల్ ద్వారా ధూళిపాళ్ల నరేంద్రకు పంపారు. కోర్టు తీర్పునకు లోబడి ప్రక్రియ ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
Next Story