Wed Dec 25 2024 01:22:48 GMT+0000 (Coordinated Universal Time)
గోరంట్ల ట్వీట్.. అధినేత పైనేనా?
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆయన పరోక్షంగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరతానని చెప్పిన మరుసటి రోజే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయడం విశేషం.
కోవర్ట్ ఆపరేషన్ అంటూ...
కోవర్ట్ ఆపరేషన్ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. వైసీపీ కోవర్టు డ్రామా స్టార్టయిందంటూ ఆయన ట్వీట్ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ ఇలాగే ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. జాగ్రత్త త్తముళ్లూ అంటూ ఆయన చేసిన ట్వీట్ చంద్రబాబు ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపైనేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Next Story