Mon Dec 23 2024 16:57:35 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఇప్పటికీ అంత బలంగా కన్పిస్తున్నారా?
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వర్సెస్ ఈడీ అన్నది కేంద్రంలో నడుస్తుందని అన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేకహోదాను సాధిస్తామన్న జగన్ ఏం చేస్తున్నారన్నారు. కేంద్రంపై మీ యుద్ధం ఎక్కడకు పోయిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. హోంశాఖ అజెండాలో ప్రత్యేక హోదా బిల్లు పెట్టి తీసివేయడం వెనక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నారని, చంద్రబాబు ఇప్పటికీ కేంద్రాన్ని శాసించేంత బలంగా మీకు కన్పిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
వాస్తవాలు మాట్లాడండి....
వాస్తవాలు వైసీపీ నేతలు మాట్లాడితే మంచిదని పయ్యావుల కేశవ్ హితవు పలికారు. హోదా వస్తే పరిస్థితి మారిపోతుందని జగన్ పల్లె పల్లె తిరిగి చెప్పారని,, 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే కేంద్రం ఎదుట ఎందుకిలా సాగిలపడాల్సి వచ్చిందని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. హోదాపై ఇంతవరకూ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదన్నారు. కేంద్రాన్ని హోదాపై ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నారో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
Next Story