Thu Dec 19 2024 12:54:29 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఒకరు ఫామ్ హౌస్ లో.. మరొకరు ప్యాలెస్ లో...సోమిరెడ్డి సెటైర్లు
తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు
రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారిలో ఒకరు ఫామ్ హౌస్ కు, మరొకరు ప్యాలెస్ కు పరిమితం అయ్యారని ఆయన సెటైర్ వేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కనిపించకుండా... నియంతల్లా వీరిద్దరూ వ్యవహరించారని విమర్శించారు.
ప్రజా సమస్యలను...
ప్రస్తుత సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా... ఈరోజు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో చర్చలు జరపబోతున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రానున్న రోజుల్లో తెలుగు జాతికి నిండు వెలుగులు రావడం ఖాయమని అన్నారు.
Next Story