Thu Dec 26 2024 16:31:40 GMT+0000 (Coordinated Universal Time)
Ram Gopal Varma : వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నిన్నహాజరు కావాల్సి ఉండగా...
వాస్తవానికి నిన్న రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు సినిమా షూటింగ్ లు ఉన్నందున నాలుగు రోజుల తర్వాత హాజరవుతానని తన న్యాయవాదుల చేత పోలీసులకు సమాచారం పంపించిన వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేశారు.
Next Story