Thu Apr 10 2025 06:05:26 GMT+0000 (Coordinated Universal Time)
వర్మ నేడు పోలీస్ స్టేషన్ కు వస్తారా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు పోలీసుల ఎదుటకు హాజరు కావాల్సి ఉంది

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు పోలీసుల ఎదుటకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆయనకు నోటీసుల్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో...
ఎక్స్ లో పనవ్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టినందుకు రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదు అయింది. టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాలన్నారు. అయితే హైకోర్టును ఆశ్రయించినా వర్మకు ఊరట లభించలేదు. ఈరోజు రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు పోలీస్ స్టేషన్ కు వస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
Next Story