Fri Feb 21 2025 11:11:21 GMT+0000 (Coordinated Universal Time)
వర్మ సంగతి నేడు తేలనుందా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదయింది.
ముందస్తు బెయిల్ కోసం...
పోలీసులు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే తనకు ముందుగా నిర్ణయించుకున్న మేరకు షూటింగ్ లు ఉన్నందున తాను నాలుగు రోజుల తర్వాత విచారణకు వచ్చి సహకరిస్తానని వర్మ తెలిపాడు. అయితే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశముందని భావించిన రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును విచారించగా నేడు న్యాయస్థానం ఆ పిటీషన్ పై విచారణ చేపట్టనుంది.
Next Story