Tue Apr 22 2025 19:53:37 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల ఘాట్ రోడ్డులో వరస ప్రమాదాలు
తిరుమల ఘాట్‌లో వరస ప్రమాదాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి

తిరుమల ఘాట్‌లో వరస ప్రమాదాలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం రెండు వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెన్నైకి చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొదటి ఘాట్ రోడ్డు మీదుగా కిందకు వెళ్తుండగా కారు టైరు పేలిపోయింది.
కారు అదుపు తప్పి...
దాంతో కారు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. హైదరాబాద్‌కు చెందిన పి.గంగాధర్‌రావు కుటుంబం ఇదే మార్గంలో కారులో వెళ్తుండగా కల్వర్టును ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. కొందరు అతివేగంతో ప్రమాదాల బారిన పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కోరుతున్నారు.
Next Story