Sat Dec 21 2024 00:12:40 GMT+0000 (Coordinated Universal Time)
పిడుగులు పడి ఏడుగురు మృతి
పిడుగులు పడి ఏడుగురు మరణించిన ఘటన ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల జరిగింది
పిడుగులు పడి ఏడుగురు మరణించిన ఘటన ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల జరిగింది. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు చేస్తున్నా రైతులు, కూలీలు పొలాల్లో ఉండటం వల్లనే మరణించారని చెబుతున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి మరణించిన వారిలో ఇద్దరు పిడుగు శబ్దానికి గుండె ఆగి చనిపోయినట్లు తెలిపారు.
పొలాలకు వెళ్లి...
ప్రకాశం జిల్లా నాగంబొట్లపాలెంకు ెందిన బాలిక శిరీష తన తల్లితో కలసి పొలానికి వెళ్లగా పిడుగు పడి తీవ్రంగా గాయపడింది. గుంటూరు జిల్లాలోనూ ఇద్దరు రైతులు మరణించారు. విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలను పాటించాలని, లేకుంటే మరణాలు సంభవిస్తాయని అధికారులు చెబుతున్నారు.
Next Story