ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి పలు రైళ్ల రద్దు
Several trains cancelled, Check list. నేటి నుంచి పలు రైలు రద్దు కానున్నాయి. నెల్లూరు, విజయవాడ-గూడూరు డివిజన్లో మూడోలైన్ నిర్మాణ పనుల్లో
నేటి నుంచి పలు రైలు రద్దు కానున్నాయి. నెల్లూరు, విజయవాడ-గూడూరు డివిజన్లో మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం నుంచి పలు రైళ్లు రద్దు చేసినట్లు నెల్లూరు రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఎస్.వి.ఎన్. కుమార్ పేర్కొన్నారు. 10 నుంచి 15 వరకు నెల్లూరు-సూళ్లూరుపేట-నెల్లూరు మెమో రైళ్లు, విజయవాడ-గూడూరు-విజయవాడ పాసింజర్, గూడూరు-రేణిగుంట-గూడూరు మెమో, విజయవాడ-చెన్నై-విజయవాడ పినాకిని ఎక్స్ప్రెస్లు రద్దు చేసినట్లు వెల్లడించారు.
విజయవాడ-చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ 10 నుంచి 14 వరకు రద్దు చేయగా.. బిట్రగుంట-చెన్నై-బిట్రగుంట పాసింజర్ 10, 11, 14, 15 తేదీల్లో నడవదని వెల్లడించారు. తిరుపతి-కాకినాడ పాసింజర్ 10 నుంచి 15 వరకు, కాకినాడ-తిరుపతి పాసింజర్ 11 నుంచి 16 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తిరుపతి-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 9, 11, 13 తేదీల్లో రద్దు చేయగా.. విశాఖపట్నం-తిరుపతి ఎక్స్ప్రెస్ 10, 12, 14 తేదీల్లో రద్దుచేసినట్లు ప్రకటించారు. విశాఖపట్నం-చెన్నై ఎక్స్ప్రెస్ 14న రద్దు చేయగా.. చెన్నై-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 15న రద్దు చేశారు. రైళ్లు రద్దు విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూపరింటెండెంట్ ఎస్.వి.ఎన్. కుమార్ పేర్కొన్నారు.