Mon Dec 23 2024 11:26:27 GMT+0000 (Coordinated Universal Time)
ఎండలు బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉష్ణోగ్రతల వివరాలు
కురిచేడులో, ద్వారకా తిరుమల 46.4, కొనకమిట్ల 46.3, మద్దిపాడు, అగిరిపల్లి 46.2, కురుపం, మండపేటలలో 46, రాజమండ్రి..
తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే చాలా ప్రాంతాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుటెండలు, ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఏపీలో ఇప్పటివరకూ వడగాల్పులకు నలుగురు మృతి చెందారు. రికార్డుస్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతవారంలో అసలు ఇది వేసవికాలమేనా అనిపించేలా వర్షాలు కురిశాయి. ఇప్పుడు బాబోయ్.. ఇదేం వేసవికాలంరా బాబు అనేలా మాడు పగిలే ఎండలు కాస్తున్నాయి. ప్రజలు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు.
వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులకు ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. మరో మూడురోజుల పాటు ఉభయ రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు.. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా గుంటూరు జిల్లాలోని పొన్నూరులో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెల్లూరు జిల్లా కలిగిరి, నరసరావుపేట లో 46.7, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 46.6, రాజానగరంలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కురిచేడులో, ద్వారకా తిరుమల 46.4, కొనకమిట్ల 46.3, మద్దిపాడు, అగిరిపల్లి 46.2, కురుపం, మండపేటలలో 46, రాజమండ్రి రూరల్, రాపూరు, మర్రిపుడి లలో 45.9, మాచర్ల, బొబ్బిలి లలో 45.7, సీతానగరం, వీరఘట్టం, రామచంద్రాపురంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కృష్ణాజిల్లాలోని మొవ్వ మండలం కాజలో 45.59 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడియం, కాకానిల్లో 45.4, పోలవరం, కొవ్వూరు, విస్సన్నపేట, తాళ్లరేవుల్లో 45.2డిగ్రీలు, కజులూరు, ఏర్పేడు, ఐనవిల్లి, రావులపాలెం, కె. గంగవరం, జగ్గంపేట,పెదవేగి, టి.నరసాపురం, సామర్లకోటల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో ఈ రోజు (మే16) అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాలలో రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.1 డిగ్రీలు, కరీంనగర్ లో 44.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల పాడులో 44.8 డిగ్రీలు, జగిత్యాలలో 44.5 డిగ్రీలు, నల్లగొండ జిల్లా పజ్జుర్ లో 44.7 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూర్ పహాడ్ లో 44.7 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Next Story