Mon Dec 23 2024 04:21:07 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : వాళ్లిద్దరికీ ఓటేస్తే ఓటు డ్రైనేజీలో వేసినట్లే
విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కార్నర్ మీటింగ్ లో షర్మిల పాల్గొని ప్రసంగించారు.
విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కార్నర్ మీటింగ్ లో షర్మిల పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, కమ్మునిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పదేళ్లలో రాష్ట్రం ఏదైనా అభివృద్ధిచెందిందా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రానికి రాజధాని ఉందా? అని షర్మిలనిలదీశారు. పదేళ్ల నుంచి చంద్రబాబు, జగన్ ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారన్నారు. ఈరోజు వరకూ ప్రత్యేక హోదాను సాధించడం ఇద్దరికీ చేత కాలేదన్నారు. రాజధాని లేని రాష్ట్రం భారత దేశంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. మనకు రాజధాని లేదు.. చేతిలో చిప్ప ఉందన్నారు. చంద్రబాబు సింగపూర్ లా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. కానీ రైతులు అన్యాయం అయిపోయారు తప్పించి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
మోడీ వచ్చి నోట్లో మట్టి కొట్టి...
మోదీ వచ్చి శంకుస్థాపన చేసి మన నోట్లో మట్టి కొట్టి వెళ్లారన్నారు. త్రీడీ గ్రాఫిక్స్ లో సినిమా ను చూపించి అమరావతిని భ్రమరావతిని చంద్రబాబు చూపించారు. తాత్కాలిక భవనాలను నిర్మించి ప్రజలను మాయచేశారన్నారు. హైదరాబాద్ ను కట్టానన్న చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనయిందా? అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానని చెప్పి, తర్వాత మూడు రాజధానులంటూ మరోసారి మోసం చేశారన్నారు. పదేళ్ల తర్వాత ఎక్కడ ఉన్నామంటే ఎక్కడ వేసిన గొంగళి కూడా అక్కడే ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదన్నారు. అయినా చంద్రబాబు, జగన్ బీజేపీని పట్టుకుని వేలాడుతున్నారన్నారు. ఓటు జగన్, చంద్రబాబులకు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని షర్మిల అన్నారు.
Next Story