Mon Dec 23 2024 11:05:07 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త ఏడాది నరసాపురం రాజుకు భారీ షాక్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కొత్త ఏడాది ప్రారంభంలోనే షాక్ తగిలింది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కొత్త ఏడాది ప్రారంభంలోనే షాక్ తగిలింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆయన కంపెనీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఇండ్ భారత్ థర్మల్ పేరిట బ్యాంకుల కన్సార్టియానికి 1,383 కోట్లు రుణాలు తీసుకున్నారు. వీటిని ఎంతకూ తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆ కంపెనీ లను దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకుక జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది.
దివాలా ప్రక్రియను....
ఈ కంపెనీ రుణాలు తీసుకుంది 1,327 కోట్లు అయితే బ్యాంకులకు తనఖా పెట్టింది 872 కోట్లు ఆస్తులు మాత్రమే. అయితే దివాలా ప్రక్రియకు అనుమతించవద్దని రఘురామ కృష్ణరాజు కంపెనీ వాదించింది. అయితే ఈ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. దివాలా పరిష్కార నిపుణిడి నియామకం చేపట్టాలని, మూడు రోజుల్లో దివాలా ప్రక్రియ గడువు తో సహా అన్ని వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఫారం 2 ను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై 2019 ఏప్రిల్ లో సీబీఐ కేసు నమోదు చేసింది.
Next Story