Tue Dec 24 2024 02:23:14 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP: వైసీపీకి మరో షాక్.. ఇప్పుడు వీడింది ఎవరంటే?
గుంటూరు జిల్లా నుండి మరో వైసీపీ నేత పార్టీని వీడారు
గుంటూరు జిల్లా నుండి మరో వైసీపీ నేత పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి ఇటీవలే పార్టీని వీడగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. రోశయ్య 2019లో పోన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై గెలిచారు . 2024 సార్వత్రిక ఎన్నికల్లో రోశయ్య గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఓడిపోయారు. తన అనుచరులతో సమావేశం అయిన రోశయ్య వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కిలారి రోశయ్య ఇకపై ఏ పార్టీలో చేరుతారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మద్దాళి గిరి మళ్లీ టీడీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు నాయకుల భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Next Story