Sun Apr 13 2025 04:27:07 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అమరావతికి సింగపూర్ ప్రతినిధులు
రాజధాని అమరావతి లో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి మరోసారి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

రాజధాని అమరావతి లో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి మరోసారి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధులు ఈరోజు డు ముఖ్యమంత్రి చంద్రబాబును కలువనున్నాను. సింగపూర్ బృందంతో చంద్రబాబు చర్చించనున్నారు. గతంలో అమరావతి స్టార్ట్ అప్ ఏరియా అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో సింగపూర్ ప్రతినిధుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది.
కూటమి అధికారంలోకి రావడంతో...
వైసీపీ అధికారంలోకి రావడంతో ఒప్పందం రద్దు చేయడం, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సింగపూర్ తమ ప్రాంత అభివృద్ధికి సహకారం అందించాలని కోరడంతో సింగపూర్ ప్రతినిధుల బృందం అమరావతికి చేరుకుంది. సింగపూర్ ప్రభుత్వం నుంచివచ్చిన ప్రతినిధులతో చర్చించిన అనంతరం చంద్రబాబు వారి భాగస్వామ్యంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story