చంద్రబాబు తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఎవరు..? ఆ సంకేతాలు నిజమేనా?
ఏపీలో టీడీపీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుస కేసులు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యలతో సైకిల్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఏపీలో టీడీపీకి అన్ని ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుస కేసులు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యలతో సైకిల్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక వైపు టీడీపీకి కోర్టులో చుక్కెదురైంది. మరో వైపు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అయితే సీఐడీ పిటిషన్‌పై ఎలాంటి తీర్పు వస్తుందోననే టెన్షన్ మొదలైంది. సీఐడీ కస్టడీ పిటిషన్‌పై ఈ రోజు ఏం జరుగుతోందనని ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు నాయుడు హౌస్‌మోషన్ పిటిషన్ నిన్న కోర్టు తిరస్కరించింది. ఇవన్ని కూడా టీడీపీ నేతలను టెన్షన్ పుట్టించేలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడును కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్‌ను నిన్న కోర్టు ఈ రోజుకు వాయిదా వేసింది. మరి సీఐడీ పిటిషన్‌పై కోర్టు నుంచి సానుకూలమైన తీర్పు వస్తందా..?లేదా అన్నది ఉత్కంఠంగా మారింది.