Thu Dec 19 2024 12:55:01 GMT+0000 (Coordinated Universal Time)
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో కీలక మలుపు
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని సీఐడీకి ఫిర్యాదు అందింది
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. మొత్తం పన్నెండు మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని సీఐడీకి ఫిర్యాదు అందింది. టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని న్యాయవాది ప్రసాద్ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీరిలో అజయ్ కల్లంరెడ్డి, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మి, ప్రేమచంద్రారెడ్డి, సిసోడియా, కవీ సత్యనారాయణ, శ్యామూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, ఆర్జా శ్రీకాంత్, జయలక్షిలను విచారించాలని సీఐడీకి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
ఐఏఎస్ అధికారులను...
వీరితో పాటు కాంట్రాక్టు చెక్ పవర్ తో సంబంధం ఉన్న వివిధ స్థాయిలో ఉన్న అధికారులందరినీ కూడా విచారించాలని ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ప్రస్తుత స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, అప్పడి సీఎండీ బంగారు రాజును కూడా విచారించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీఐడీ అధికారులు వీరందరిపై విచారణ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంతగతి తెలిసిందే.
Next Story