Sun Dec 22 2024 23:17:24 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నాయుడు.. అరెస్టు తప్పదా?
స్కిల్ డెవలప్మెంట్ -సీమెన్స్ ప్రాజెక్టులో రూ.371 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఏ1 నిందితుడు
స్కిల్ డెవలప్మెంట్ -సీమెన్స్ ప్రాజెక్టులో రూ.371 కోట్ల కుంభకోణానికి సంబంధించి నిందితుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఏ2గా ఉన్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. గతంలో ఈఎస్ఐలో అవినీతికి పాల్పడిన కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు.. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఈ కేసులో కూడా అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కుంభకోణానికి కేంద్రమైన స్కిల్డెవలప్మెంట్ సంస్థ కార్మికశాఖ పరిధిలోకి వస్తుంది. ఈ కుంభకోణంలో చంద్రబాబు నాయుడితో పాటు అచ్చెన్నాయుడి పాత్ర కూడా ఉన్నట్టు సీఐడీ నిర్ధారించింది. ఈ మేరకు అచ్చెన్నను ఏ2 నిందితుడిగా చేర్చింది. ఏ1 నిందితుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక అచ్చెన్న ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు వారిని టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బందం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుపై "జగన్ రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలుని తీవ్రం చేశాడు. టిడిపి అధినేత చంద్రబాబుని చట్టాల్ని ఉల్లంఘించి మరీ అక్రమ అరెస్టు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి ప్రతిపక్ష నేతని తప్పుడు మార్గంలో అరెస్టు చేయించిన వైకాపా పతనం ఖాయం." అంటూ పోస్టు పెట్టారు అచ్చెన్నాయుడు.
Next Story