Fri Dec 27 2024 19:44:18 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో ఫ్లెక్సీలు.. అసత్య ప్రచారం చేయవద్దంటూ?
సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం నిలువరించేందుకు పెద్దయెత్తున ప్రచారానికి కొందరు నడుంబిగించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం నిలువరించేందుకు పెద్దయెత్తున ప్రచారానికి కొందరు నడుంబిగించారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ లు మంచి కోసం ఉపయోగించాలని కోరుతూ విజయవాడతో పాటు అమరావతి ప్రాంతంలో పెద్దయెత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పటికే సోషల్ మీడియాల్లో రాజకీయ పార్టీల ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు అసత్య ప్రచారం దిగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు కొంత ఆలోచించ చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో...
అయితే ఎవరు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్నది తెలియకపోయినా ముఖ్యంగా యువతకు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి సూచనలు చేస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు కనపడుతుంది. నూతన ఏడాదిలోనైనా సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి తెరదించాలన్న ప్రయత్నంలో భాగంంగానే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు అర్ధమవుతుంది
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story