Mon Mar 17 2025 01:54:23 GMT+0000 (Coordinated Universal Time)
రైల్లో దొంగలు పడ్డారు... దోపిడీకి ప్రయత్నించారు కాని ...?
రైల్లో దొంగతనం చేయడానికి కొందరు ప్రయత్నించారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో చోరీకి దొంగలు యత్నించారు. ది.

రైల్లో దొంగతనం చేయడానికి కొందరు ప్రయత్నించారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో చోరీకి దొంగలు యత్నించారు. పల్నాడు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లోని బీ 5, ఎస్ 10, ఎస్ 13 బోగీల్లో కొందరు దూరి దోపిడీకి ప్రయత్నించారు. అయితే ఒక మహిళ తన మెడలో నుంచి దొంగ గొలుసును లాగడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది.
కేకలు వేయడంతో...
వెంటనే రైల్వే స్టేషన్ లో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విజిల్స్ వేసుకుంటూ ఆర్పీఎఫ్ సిబ్బంది రావడంతో దొంగలు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ నుంచి పరారయ్యారు. అయితే పారిపోతూ దొంగలు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో ఉన్న ప్రయాణికులపై రాళ్లు రువ్వారు. రైలు నర్సాపూర్ నుంచి లింగంపల్లి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story