Mon Dec 23 2024 14:18:28 GMT+0000 (Coordinated Universal Time)
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
వందే భారత్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు
వందే భారత్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. విశాఖపట్నంలోని కంచరపాలెం రామ్మూర్తి పంతులు గేటు వద్ద ఈ ఘటన జరిగింది. రాళ్లదాడిలో రైలు అద్దాలు పాక్షింగా దెబ్బతిన్నాయి. ఎందుకు దాడి చేశారన్న దానిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు. మద్యం తాగి దాడి చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు.
మద్యం మత్తులో...
వందే భారత్ రైలును ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దుండగులు జరిపిన దాడిలో రెండు కోచ్ ల అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శంకర్, దిలీప్, చందు అనే యువకులను అనుమానితులుగా భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని, అప్పుడు దాడికి గల కారణాలు వెల్లడవుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ట్రయల్ రన్ కోసం వస్తుండగా ఈ దాడి జరిగింది.
Next Story