Thu Dec 19 2024 13:08:58 GMT+0000 (Coordinated Universal Time)
TDP : కాకాణికి లింకులున్నది నిజమే
బెంగళూరు రేవ్ పార్టీలో కాకాణి పాస్ పోర్ట్, కారు స్టిక్కర్ దొరికాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు
బెంగళూరు రేవ్ పార్టీలో కాకాణి పాస్ పోర్ట్, కారు స్టిక్కర్ దొరికాయని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పాస్పోర్ట్, కారు స్టిక్కర్ తో తనకు సంబంధం లేదని కాకాణి చెబుతున్నారని, తాను ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడైనా నిజం చెప్పారా?
కాకాణి ఎప్పుడైనా నిజం చెప్పారా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. డ్రగ్స్, లిక్కర్, రెడ్ శాండల్ మాఫియాతో కాకాణికి లింకులున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను కేంద్ర హోంశాఖకు లేఖరాస్తున్నట్లు తెలిపారు.
Next Story