Thu Dec 19 2024 12:28:02 GMT+0000 (Coordinated Universal Time)
TDP : జగన్ .. నువ్వు ఇలా చెప్పడం ఏమైనా బాగుందా?
వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించింది వైసీపీ నేతలే నంటూ వ్యాఖ్యానించారు. వై నాట్ 175 అని ప్రగల్భాలు పలికిన జగన్‌కు ప్రజలు చెంప దెబ్బ కొట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
మాజీ సీఎస్ ను...
వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ప్రజలు ఇవ్వలేదని ఆయన అన్నారు. మాజీ సీఎస్‌ను రాష్ట్రం నుంచి వెళ్లకుండా గవర్నర్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. అనేక అవకతవకలకు కారణమైన ఎవరినీ వదలపెట్టకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story