Mon Dec 23 2024 01:20:35 GMT+0000 (Coordinated Universal Time)
55 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు రైళ్ల రద్దును పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు రైళ్ల రద్దును పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ రైళ్ల రద్దను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ నెల 24వ తేదీ వరకూ పలు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈరోజుతో గడువు పూర్తి కావడంతో ఈ నెల 31వ తేదీ నుంచి ఈ రైళ్ల రద్దును పొడిగించింది.
ఈ సర్వీసులను....
సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, కర్నూలు, కలబుర్గి, చెన్నై వంటి స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చిత్తూరు - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - చిత్తూరు, కాజేపట్ - సికింద్రాబాద్, హైదరాబాద్ - కాజీపేట్ ల మధ్య నడిచే పలు రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.
Next Story