Sun Dec 22 2024 22:44:01 GMT+0000 (Coordinated Universal Time)
Palnadu : అత్యంత చెత్త జిల్లా పల్నాడు : ఎస్పీ మల్లిక గార్గ్
పల్నాడు జిల్లాను ఉద్దేశించి ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పల్నాడు జిల్లాను ఉద్దేశించి ఎస్పీ మల్లిక గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా పల్నాడు అంటూ ఎస్పీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యారు. పల్నాడు ప్రాంతానికి మంచి పేరు ఉందని, దానిని మీరు చెడగొట్టొద్దని ఆమె పిలుపు నిచ్చారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అరాచకంగా ఉంది.
కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడం, తగలబెట్టడం లాంటివి జరిగితే సహించేది లేదని ఎస్పీ మల్లిక గార్గ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు అంటే ఇక్కడ ఎవరికీ భయం లేదని, మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉందని అన్నారు. మంచి జిల్లాగా మారడానికి అవకాశం ఉందని, అందుకు ప్రజల సహకారం అవసరమని ఎస్పీ మాల్లిక గార్గ్ కోరారు.
Next Story