Sun Dec 22 2024 23:29:24 GMT+0000 (Coordinated Universal Time)
Speaker : నేడు మరోసారి విచారణ.. అనంతరం నిర్ణయం ఉంటుందా?
ఆంధ్రప్రదేశ్ లో రెబల్ ఎమ్మెల్యేలతో నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి విచారణ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో రెబల్ ఎమ్మెల్యేలతో నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి విచారణ చేయనున్నారు. అయితే ఈరోజు ఆయన వారి అనర్హత వేటు పై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ఇప్పటికే పలుమార్లు వైసీపీ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను స్పీకర్ విచారణ చేశారు. ఇటు వైసీపీ, అటు టీడీపీ తమ పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీకి మద్దతుగా నిలిచిన వారిపై అనర్హత వేటు వేయాలని పిటీషన్ ఇచ్చిన నేపథ్యంలో నేడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీ ఫిరాయించిన...
వైసీపీ నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. అలాగే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరిలు వైసీపీకి మద్దతుదారులుగా నిలిచారు. జనసే నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు కూడా వైసీపీ వెంట ఉండటంతో వీరందరిపై విచారణ జరిపిిన స్పీకర్ నేడు నిర్ణయం ప్రకటించే అవకాశముంది. నేడు మరోసారి విచారణ చేపట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్పీకర్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
Next Story