Sun Dec 14 2025 18:08:51 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : మూడో రోజు తిరుమల లడ్డూ వివాదంపై సిట్ బృందం విచారణ
తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తన విచారణను ప్రారంభించింది

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం తన విచారణను ప్రారంభించింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారంటూ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడో రోజు కూడా తన దర్యాప్తును రెండు బృందాలుగా విడిపోయి వేర్వేరు అంశాలపై దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తును వేగిరంగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్న సంకల్పంతో మూడు రోజుల నుంచి విచారణ ప్రారంభించింది.
తమిళనాడుకు వెళ్లి...
నిన్న తిరుపతి గెస్ట్ హౌస్ లో సమావేశమై ఎవరెవరు? ఏం పనులపై విచారణ చేపట్టాలో చర్చించుకున్నారు. గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ నేతృత్వంలో సిట్ అధికారులు దర్యాప్తును వేగిరం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావును సిట్ బృందం విచారించింది. ఆయన విచారణలో వెల్లడయిన విషయాలను అధ్యయనం చేస్తూనే మరొక వైపు తమిళనాడులోని దుండిగల్ లో ఉన్న ఏఆర్ డెయిరీకి కూడా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. అక్కడ ఏఆర్ డెయిరీ ప్రతినిధులను సిట్ బృందం విచారణ చేయనుంది.
Next Story

