Mon Dec 23 2024 06:08:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిట్ సీఎస్ కు సిట్ నివేదిక
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం నేడు డీజీపీకి నివేదిక అందించనుంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం నేడు డీజీపీకి నివేదిక అందించనుంది. మే 13వ తేదీ ఎన్నికలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులోని నరసరావుపేట, మాచర్లతో పాటు రాయలసీమలోని తాడిపత్రి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మకఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల అనంతర హింసపై...
ప్రత్యేక దర్యాప్తు బృందం గత రెండు రోజుల నుంచి మూడు జిల్లాల్లో పర్యటించి వివరాలను సేకరించింది. ఈరోజు ప్రాధమిక నివేదికను చీఫ్ సెక్రటరీ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ కు అందించనుంది. పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు సిట్ అధికారులు కొంత గడువు కోరారు. ఈరోజు అందించే నివేదిక కేవలం ప్రాధమికంగా జరిపిన పరిశీలన మాత్రమే.
Next Story