Mon Dec 23 2024 03:22:26 GMT+0000 (Coordinated Universal Time)
లడ్డూ వివాదం : నేటి నుంచి సిట్ విచారణ వేగవంతం
తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నేటి నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది.
తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నేటి నుంచి దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న సిట్ బృందం సభ్యులు మూడు బృందాలుగా విడిపోయారు. ఏకకాలంలో తిరుపతి, తిరుమలలో దర్యాప్తు జరపాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా కౌంటర్ ఎటాక్ కు దిగింది
విచారణ కోసం మూడు బృందాలుగా విడిపోయి...
దీంతో సిట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం త్వరగా విచారణ పూర్తి చేసి బాధ్యులైన వారి గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నిన్న తిరుమలకు చేరుకున్న సిట్ బృందం నేటి నుంచి విచారణను ముమ్మరం చేయనుంది. వీలయినంత త్వరగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని భావిస్తుంది. ఇటు టీటీడీ అధికారులు, పోటు సిబ్బందితో పాటు ఏఆర్ డెయిరీ ప్రతినిధులను కూడా విచారించనుంది. కల్తీ నెయ్యిని ఎప్పుడు వాడారు? అసలు లడ్డూల తయారీలో వినియోగించారా? లేదా అన్న కోణంలో ఈ దర్యాప్తు కొనసాగనుంది.
Next Story