పందాలకు రెడీ అవుతున్న కోళ్లు.. మిలటరీ స్థాయిలో శిక్షణ.. ఖర్చు ఎంతో తెలిస్తే షాకవుతారు!
Kodi Pandalu: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు..
☛ పందాలకు సిద్దమవుతున్న కోడి పుంజులు
☛ మిలటరీ స్థాయిలో శిక్షణ
☛ లక్షల్లో ఖర్చు
☛ పందాల కోసం కోళ్ల జాతకాలు
☛ కోడి పందేలకు కుక్కుట శాస్త్రం
☛ కోళ్లకు స్విమ్మింగ్
☛ అలసిపోకుండా కోళ్లకు డ్రైఫ్రూట్స్
Kodi Pandalu: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు. వీటన్నింటి మధ్యలో ఆట విడుపుగా కోడి పందేలు. పల్లెల్లో కోడి పందేల సందడి అంతా ఇంతా కాదండోయ్. పండగకు ఐదు నెలల ముందు నుంచే కోడి పుంజులను సిద్దం చేసుకుంటారట. మరి ఖర్చు ఎంత అవుతుందో తెలిస్తే షాకవుతారు. లక్షల్లో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు. కోళ్లకు ఇచ్చే ట్రైనింగ్ మామూలుగా ఉండదు. మిలటరీ స్థాయిలో శిక్షణ ఇస్తారు.
పందెం కోళ్లు
ఇక ఏపీలోని పలు జిల్లాల్లోని కొన్నిగ్రామాలు సంక్రాంతి కోడిపందాలకు సిద్ధమవుతున్నారు. పందెం కోళ్లను నిత్యం ముగ్గురు వాటి సంరక్షణ చూస్తుంటారు. ఉదయాన్నే ఐదుగంటలకు కోడి పుంజులను బయటకు తీసి కాసేపు చల్లటి గాలి శ్వాస తీసుకునేలా చేస్తారట., చుట్టు వలయంగా ఏర్పాటు చేస్తారు. అందులో పుంజులను వదిలి పరుగెత్తిస్తారు. తర్వాత వలయం నుంచి బయటకు తీసి స్విమ్మింగ్ కూడా చేయిస్తారు. ఇక పుంజులు అలసిపోవడంతో పాలల్లో నానబెట్టిన బాదం,పిస్తా, ఖర్జూర,కిస్మిస్లను పెట్టి సిరంజి ద్వారా పాలను పట్టిస్తారు. ఒక్కో పుంజుకు రోజుకు రూ.100 నుంచి రూ.500లకుపైనే ఖర్చు చేస్తారని పందాల్లో పాల్గొనేవారు చెబుతున్నమాట. పందెం కోళ్లను తయారు చేయడంలో వారు తీసుకునే జాగ్రత్తలు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. కోడి పందెలలో అన్ని విధాలుగా తట్టుకులా తయారు చేస్తారు.
కోడి పుంజులు ఎన్ని రకాలు ఉంటాయి?
కోడి పుంజుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. గౌడ నెమలి, తెల్లనెమలి, కోడి నెమలి, కాకి డేగ, కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్, ఎర్రడేగ వంటి జాతులు ఉంటాయట. వీటిలో తెల్ల నెమలి, గౌడ నెమలి, రసంగి, అబ్రాస్ పుంజులు ఎంతటి పందెంనైనా నెగ్గే శక్తి ఉంటుంది. ఒక్కో పుంజు ఖర్చు లక్షకుపైమాటే. ఈ పుంజులకు బలమైన ఆహారంతో పాటు ప్రత్యేక శిక్షకుడిని నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పందెం కోడి తయారయ్యేలా చేస్తారు. కోడి పూర్తిస్థాయిలో పందేనికి సిద్ధమైతే లక్ష రూపాయల ధర పైనే పలుకుతుందని శిక్షకులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ సంస్కృతిలో భాగంగా కోడి పందేలు వేస్తారని, వారం తర్వాత కోడి పుంజుల గిరాకీ కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. సంక్రాంతి పండగ నెల రోజుల నుంచి కోడి పుంజుల గిరాకీ బాగా ఉంటుంది.
కోడి పందేలకు కుక్కుట శాస్త్రం..
కోడి పందేల్లో ప్రావీణ్యం ఉన్నవారు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇక పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేస్తారట. ఆ రోజు ఏ రంగుతో ఉన్న పుంజును పందెంలోకి దించాలో ఆ రంగున్న పుంజును మాత్రమే పందెంలోకి దించుతారు.
13న భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు పందాలలో విజయం సాధిస్తాయని, 14న యాసర కాకిడేగలు, కాకి నెమలి, పసి మగల్ల కాకులు, కాకిడేగలకు చెందిన పుంజులు గెలుపొందుతయని, అలాగే 15న డేగలు, ఎర్రకాకి డేగలు పందెంలో గెలుపొందుతాయని కోడిపందాల్లో ప్రావీణ్యం ఉన్నవారు చెబుతున్నారు. దీనిని బట్టి ఏ కోడిని పందాల్లో దింపాలన్నది నిర్ణయించుకుంటారని పందాల్లో పాల్గొనే వారు చెబుతున్నారు.