Mon Dec 23 2024 18:44:48 GMT+0000 (Coordinated Universal Time)
Arogya Sri : రేపటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలను నిలపివేస్తున్నట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలను నిలపివేస్తున్నట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలో తెలియజేసింది. మే 22వ తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పెండింగ్ బిల్లులు అధిక మొత్తంలో రావాల్సి ఉండటంతో దానిని నిలిపేయాలని నిర్ణయించుకున్నామని చెప్పింది.
పెండింగ్ బిల్లుల కోసమే...
గత ఏడాది ఆగస్టు నుంచి సుమారు 1,500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పింది. పెండింగ్ బిల్లులు చెల్లించన తర్వాతనే ఆరోగ్య శ్రీ సేవలను పునరుద్ధరిస్తామని స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన లేఖలో పేర్కొంది. సుదీర్ఘకాలం నుంచి పెండింగ్ లో ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఎన్ని సార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, కేవలం యాభైకోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందని లేఖలో తెలిపింది.
Next Story