Mon Dec 23 2024 08:33:28 GMT+0000 (Coordinated Universal Time)
ఒంటిమిట్టలో నవమి వేడుకలు
నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి
నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 20న హనుమంత వాహనంపై రాములవారు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీరామనవమి వేడుకలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.
26తో ముగియనున్న...
ఈ నెల 21న గరుడసేవ, 22న కల్యాణ వేడుకలను నిర్వహిస్తారని ఆలయ పూజారులు తెలిపారు. 26న పుష్పయాగంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం అక్కడ శ్రీరామ నవమి వేడుకలను నిర్వహిస్తుంది.
Next Story