Mon Dec 23 2024 16:17:50 GMT+0000 (Coordinated Universal Time)
కోడికత్తి కేసు నిందితుడిని విడుదల చేయండి ప్లీజ్
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ ను విడుదల చేయాలంటూ అతడి తల్లి సావిత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ ను విడుదల చేయాలంటూ అతడి తల్లి సావిత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్ ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే ఉంచారని, ఎన్ఐఏ, న్యాయస్థానం ఎలాంటి విచారణ చేయడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.
అక్రమ కేసు...
తన కుమారుడు శ్రీనివాస్ పై నాలుగేళ్ల క్రితం కోడికత్తి దాడి కేసు నమోదయిందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ చేతికి గీసుకుపోయిందని, దీనిపై రాద్ధాంతం చేస్తూ తన కుమారుడిపై అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని శ్రీనివాస్ తల్లి సావిత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఎలాంటి విచారణ చేయకుండా జైలులోనే ఉంచారని ఆమె లేఖలో పేర్కొన్నారు. తక్షణం ఈ కేసును విచారించాలని ఆమె లేఖలో కోరారు.
Next Story