Fri Dec 20 2024 14:38:44 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలం ఆలయంపై డ్రోన్ కలకలం
శ్రీశైలం ఆలయంలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంపై డ్రోన్ ను ఎగురవేశారు.
శ్రీశైలం ఆలయంలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంపై డ్రోన్ ను ఎగురవేశారు. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని గుర్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఎగురు వేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. శ్రీశైలంలో పోలీసులు ఈ వ్యక్తి కోసం జల్లెడ పడుతున్నారు.
ముమ్మరంగా తనిఖీలు...
కావాలని ఈ పనిచేశారా? లేక ఆకతాయిలు చేసిన వ్యవహారమా? అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. దీనిపై పోలీసులు సీరియస్ గా వెతుకుతున్నారు. అనేక బృందాలుగా విడిపోయి డ్రోన్ ఎగురవేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అన్ని సత్రాల్లోనూ అధికారులు వెతుకుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనపడితే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు భక్తులను కోరుతున్నారు. ఘాట్ రోడ్డులోనూ తనిఖీలు ముమ్మరం చేశారు.
Next Story