Fri Dec 20 2024 01:50:45 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్లుండి శ్రీశైలం ఆలయం మూసివేత
ఈ నెల 28వ తేదీన శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఎల్లుండి చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు
ఈ నెల 28వ తేదీన శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఎల్లుండి పాక్షిక చంద్రగ్రహణ కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకూ ఆలయ ద్వారాలు మూసి ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు.
మధ్యాహ్నం వరకే...
భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీశైలానికి చేరుకోవాలని కోరుతున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులకు శ్రీశైలంలోని ఆలయంలోనికి అనుమతిస్తామని తెలిపారు. తిరిగి 29 ఉదయం ఏడు గంటల తర్వాతనే దర్శనం ఉంటుందని, దీనిని గుర్తుంచుకుని శ్రీశైలం పర్యటనను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Next Story