Mon Dec 23 2024 01:51:06 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవాణి ట్రస్ట్ కు విరాళాలు వేలకోట్లా? ఊహించని రెస్పాన్స్
శ్రీవాణి ట్రస్ట్ కు అనూహ్య స్పందన లభిస్తుంది. భక్తులు ఇచ్చిన విరాళాలతో ట్రస్ట్ నిధులు వేల కోట్లకు చేరుకున్నాయి
శ్రీవాణి ట్రస్ట్ కు అనూహ్య స్పందన లభిస్తుంది. భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు విరాళాలు ఇస్తుండటంతో ట్రస్ట్ నిధులు వేల కోట్లకు చేరుకున్నాయి. తిరుమల వెళ్లే భక్తులందరీకీ శ్రీవాణి ట్రస్ట్ సుపరిచితమే. ఈ ట్రస్ట్‌కు విరాళాలందించాలని గత కొన్నేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది.
అన్న ప్రసాదం ట్రస్ట్ కు...
సాధారణంగా అన్న ప్రసాదం ట్రస్ట్ కు విరాళాల వెల్లువ కొనసాగుతుంది. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదానానికి దాతలు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి విరాళాలిస్తారు. కానీ అనూహ్యంగా దానిని మించి శ్రీవాణి ట్రస్ట్ కు విరాళాలందడం విశేషంగా చెప్పుకోవచ్చు. 39 ఏళ్లలో అన్న ప్రసాదం ట్రస్ట్ కు 1,896 కోట్ల రూపాయలు విరాళాలు అందాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే ఆరేళ్లలో శ్రీవాణి ట్రస్ట్ కు 1,302 కోట్ల రూపాయల విరాళాలందాయని అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ పై భక్తులు పెట్టుకున్న నమ్మకం ఏంటో ఈ విరాళాల మొత్తాన్ని చూసిన తర్వాత అర్థమవుతుంది.
Next Story