Mon Dec 23 2024 14:25:13 GMT+0000 (Coordinated Universal Time)
27న శ్రీవారికి జగన్ పట్టు వస్త్రాలు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల ఆరోతేదీ వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది ...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది. గత రెండు సంవత్సరాలుగా మాడ వీధుల్లో శ్రీవారి వాశన ఊరేగింపు జరగడం లేదు. కరోనా కారణంగా భక్తులను ఎవరినీ అనుమతించలేదు. ఆలయం లోపే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు టీటీడీ నిర్ణయించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశమున్నందున భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story