Fri Nov 22 2024 11:23:47 GMT+0000 (Coordinated Universal Time)
నేరుగా దర్శనానికి
నేటి నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
నేటి నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అవసరమైన భద్రతతో పాటు తిరుమల వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నేటి నుంచి మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
నిన్న ఆదాయం...
తిరుమలలో నిన్న భక్తుల సంఖ్య అధికంగానే ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,441 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,816 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
రష్ అంతగా...
ఈరోజు మాత్రం తిరుమలలో రద్దీ అంతగా లేదు. నేరుగా ఎక్కడా ఆగకుండానే శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి చూడకుండానే నేరుగా క్యూలైన్ లో వెళ్లి స్వామి వారిని దర్శించుకునే వీలుంది. సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వినాయక చవితి కావడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.
Next Story