Thu Jan 09 2025 06:51:33 GMT+0000 (Coordinated Universal Time)
Tirupati Stampede తిరుపతిలో తోపులాట.. నలుగురు మృతి
భక్తులు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు
తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తోంది. తిరుపతి, తిరుమలలో డిసెంబర్ 9 నుండి టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతిలోని శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. భక్తులు సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్దకు అదనపు పోలీసు బలగాలను తరలించారు.
Next Story