Tue Dec 24 2024 13:10:03 GMT+0000 (Coordinated Universal Time)
యువశక్తి సభలో లాఠీఛార్జి
శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో తోపులాట జరిగింది. పవన్ కల్యాణ్ వేదిక పైకి వచ్చిన కార్కకర్తలు ముందుకు తోసుకువచ్చారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో తోపులాట జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేదిక పైకి వచ్చిన వెంటనే కార్కకర్తలు ముందుకు తోసుకువచ్చారు. బారికేడ్లను తోసుకు వచ్చేందుకు అభిమానులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పార్టీ కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేశారు.
పోలీసులపై తిరగబడటంతో...
కార్యకర్తలను పలుమార్లు ఆగాలని చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఓ కార్యకర్త ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల మీద కార్యకర్తలు తిరగబడ్డారు. గాయపడిన కార్యకర్తకు చికిత్స అందించేందుకు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story