Wed Dec 18 2024 19:42:14 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు
తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ నేతలు టీడీపీ నేత లోకేష్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైఎస్ జగన్ పై వ్యతిరేకంగా ఒక పాటను రూపొందించి దానిని సోషల్ మీడియాలో పోస్టులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా ప్రజల్లోకి పంపుతున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు పై కూడా...
అలాగే సీఎం జగన్ పై దాడి జరిగిన ఘటనపై చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా లో జగన్ పై దుష్ప్రచారం చేయడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపడుతోంది
Next Story