Tue Nov 26 2024 22:16:09 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : మందుబాబులకు గుడ్ న్యూస్ రూ.99లకే మద్యం అందుబాటులో
తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం ఏపీలో త్వరలో అందుబాటులోకి రానుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిషాంత్ కుమార్ చెప్పారు
తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం ఏపీలో త్వరలో అందుబాటులోకి రానుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిషాంత్ కుమార్ చెప్పారు.సోమవారం నాటికి ఇరవై కేసులు చేరుకోనున్నాయని తెలిపారు.ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్దంగా ఉంటుందని ఆయన తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్దాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన ఐదు సంస్దలు ఆంధ్రప్రదేశ్ లో ఈ ధరకు మద్యం విక్రయాలు చేసేందుకు సిద్దం అయ్యాయన్నారు.
రోజూ ఇరవై వేల కేసులు...
గురువారం నాటికి పదివేల కేసుల రూ.99 మద్యం మార్కెట్ కు చేరిందని, సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని వివరించారు. దశల వారిగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ క్రమంలో మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మధ్యం ఈ నెలలో అందుబాటులోకి రానుందన్నారు. వినియోగాన్ని అనుసరించి తదుపరి నెలలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని నిషాంత్ కుమార్ తెలిపారు.
Next Story